ఓవెల్ స్కూల్ గుర్తింపు రద్దు చేసిన అధికారులు : ఇతర స్కూళ్లకు విద్యార్ధులు

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు డైకాస్ రోడ్డులోని ఓవెల్ 14 స్కూల్ గుర్తింపును జిల్లా విద్యాశాఖ అధికారులు రద్దు చేశారు. శనివారం స్కూల్లోని 4వ తరగతి బాలికపై అదే స్కూల్లో పిఆర్వోగా పనిచేసే బ్రహ్మయ్య అనే వ్యక్తి లైంగిక దాడి చేసిన విషయం తెలిసిందే. బ్రహ్మయ్యకు దేహశుద్ధి చేసిన బాలిక కుటుంబసభ్యులు పోలీసులకు అప్పగించారు. బ్రహ్మయ్యపై పోక్సోతో పాటూ ఎస్టీ, ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేసి జైలుకు పంపారు వేదాయపాళెం పోలీసులు. మరో వైపు ఈ ఘటనపై జిల్లా విద్యా శాఖ విచారణ చేపట్టింది. ఈ విషయంలో స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం పూర్తిగా ఉందని నిర్ధారించుకున్న జిల్లా విద్యాశాఖ అధికారి ఆ స్కూల్ గుర్తింపును రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మరో వైపు తల్లిదండ్రుల కోరిక మేరకు ఆ స్కూల్లోని విద్యార్ధులను వారికి ఇష్టమైన స్కూళ్లలో చేర్చే భాద్యత జిల్లా విద్యాశాఖ తీసుకుంటుందని అధికారులు స్పష్టం చేశారు.

 

Read Previous

ఎమ్మెల్యే కోటంరెడ్డికి ముస్లింల సత్కారం : ఎప్పుడూ అండగా ఉంటామని హామీ

Read Next

ఓవెల్ స్కూల్ యాజమాన్యం పై క్రిమినల్ చర్యలు తీసుకోండి : విద్యార్ధి సంఘాలు

Leave a Reply

Your email address will not be published.