Clock Of Nellore ( Nellore Rural ) – నెల్లూరు రూరల్ మండలం, పాతవెల్లంటి గ్రామంలో విష జ్వరాలు ప్రభలిన విషయం తెలిసిందే. ఈ విష జ్వరాల బారిన పడి ఇటీవల ముగ్గురు మృత్యువాత పడిన విషయాన్ని తెలుసుకున్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హుటాహుటిన వైద్యాధికారులను అప్రమత్తం చేశారు. పాత వెల్లంటి గ్రామంలో మంగళవారం వైద్య శిభిరం ఏర్పాటు చేయించారు. ఈ వైద్య శిభిరాన్ని వైసీపి రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అక్కడే పర్యవేక్షించారు. గ్రామంలో పర్యటించి పారిశుధ్యాన్ని తనిఖీ చేశారు. మురుగు కాల్వల్లో నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని పంచాయితీ అధికారులను ఆదేశించారు. గ్రామస్తులందిరికీ ఆరోగ్య పరీక్షలు చేయించారు. అత్యవసరమైన వారిని నెల్లూరులోని కార్పొరేట్ వైద్యశాలలకు తరలించి చికిత్స చేయిస్తామని ఈ సందర్భంగా గిరిధర్ రెడ్డి తెలియజేశారు. రూరల్ నియోజకవర్గంలోని అన్నీ గ్రామాల్లో పరిస్థితిని సమీక్షించారు. ఈ కార్యక్రమంలో పాత వెల్లంటి సర్పంచ్ మురళీ రెడ్డి, ఎంపిటిసి అంజయ్య, చెంచయ్య, పాదర్తి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
