Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు నగరంలోని ఆత్మకూరు బస్టాండ్ వద్ద ఉన్న అండర్ బ్రిడ్జిని 1.30 కోట్లతో అభివృద్ధి చేయనున్నారు. ఈ పనులకు శనివారం ఎంపి ఆదాల ప్రభాకర్ రెడ్డితో కలిసి నగర ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ శంఖు స్థాపన చేశారు. నెల్లూరు నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకెళుతున్నట్లు అనీల్ కుమార్ ఈ సందర్భంగా తెలియజేశారు. ఎప్పుడూ రద్దీగా ఉండే ఆత్మకూరు బస్టాండ్ ప్రాంతం, మినీ బైపాస్ మార్గం అండర్ బ్రిడ్జి అభివృద్ధి వల్ల ఓ క్రమ పద్దతిగా మారుతుందని, నగరానికి మరింత వన్నె తెస్తుందని ఎంపి ఆదాల ప్రభాకర్ రెడ్డి అన్నారు. నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్న అనీల్ కుమార్ యాదవ్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో వైసిపి రాష్ట్ర కార్యదర్శి సన్నపు రెడ్డి పెంచల రెడ్డి, డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్, విజయ డైరీ ఛైర్మైన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, పలువురు కార్పొరేటర్లు నేతలు పాల్గొన్నారు.
