ఎమ్మెల్యే కోటంరెడ్డికి జై కొట్టిన సీనియర్ న్యాయవాది వేనాటి – ఆయన శిష్యులు కూడా

Clock Of Nellore ( Nellore ) – సీనియర్ న్యాయవాది, ఆనం కుటుంబానికి అత్యంత ముఖ్యులు, ఏపి బార్ కౌన్సిల్ సభ్యులు వేనాటి చంద్రశేఖర్ రెడ్డి… నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి జై కొట్టారు. రాజకీయ పరిశీలకులు ఆశ్యర్యపడేలా శనివారం ఆయన కోటంరెడ్డిని కలిశారు. ఆయనతో పాటూ ఆయన శిష్య బృందాన్ని కూడా తీసుకెళ్లారు. వేనాటి చంద్రశేఖర్ రెడ్డి సీనియర్ న్యాయవాది. మాజీ మంత్రి, ప్రస్తుత వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డికి స్నేహితులు. ఆ చనువుతో ఆనం కుటుంబానికి దగ్గరైన చంద్రశేఖర్ రెడ్డి వారి అనుచరునిగా నిన్నటి వరకూ కొనసాగారు. న్యాయ పరమైన సలహాలతో పాటూ ఎన్నికల సమయంలో వారి విజయానికి ఆయన ఎంతో కృషి చేసేవారు. ఇక పోతే ప్రస్తుత నెల్లూరు బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఉమామహేశ్వర రెడ్డికి కూడా ఆనం కుటుంబంతో ఎంతో అనుబంధం ఉంది. మాజీ బార్ అసోసియేషన్ కార్యదర్శి రామిరెడ్డి రోజారెడ్డి… వేనాటి చంద్రశేఖర్ రెడ్డి కి శిష్యులు. ఆయనా సీనియర్ న్యాయవాదే. ఉమామహేశ్వర రెడ్డి, రామిరెడ్డి రోజారెడ్డితో కలిసి శనివారం వేనాటి చంద్రశేఖర్ రెడ్డి… ఎమ్మెల్యే కోటంరెడ్డిని కలవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఈ సందర్భంగా రోజారెడ్డిని ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి సత్కరించారు.

Read Previous

ఆత్మకూరు బస్టాండ్ అండర్ బ్రిడ్జి అభివృద్ధికి శ్రీకారం – శంఖుస్థాపన చేసిన ఎంపి ఆదాల, ఎమ్మెల్యే అనీల్

Read Next

ఇవాళ రాత్రికి నింగిలోకి వెళ్లనున్న GSLV Mark-3 rocket

Leave a Reply

Your email address will not be published.