స్థంభంపైనే ప్రాణాలు విడిచిన లైన్ మెన్

Clock Of Nellore ( Marripadu ) – స్థంభం ఎక్కి విద్యుత్ లైన్ మరమ్మత్తులు చేస్తుండగా ప్రమాదవశాత్తూ విద్యుత్ ప్రసరణ కావడంతో స్ధంభంపైనే లైన్ మెన్ ప్రాణాలు విడిచిన విషాద ఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. మర్రిపాడు మండలం, పొంగూరు గ్రామంలో కరెంటును నిలుపుదల చేసి స్థంభంపైకి ఎక్కి లైన్ మెన్ వెంకటేశ్వర్లు మరమ్మత్తులు చేస్తుండగా ఒక్కసారిగా విద్యుత్ ప్రసరణ జరిగింది. దీంతో విద్యుత్ షాక్ గురై వెంకటేశ్వర్లు స్థంభంపైనే ప్రాణాలు విడిచారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. మరమ్మత్తులు చేస్తున్న సమయంలో కరెంట్ ను ఎవరు ఆన్ చేశారనేదానిపై ఆరా తీస్తున్నారు.

Read Previous

జిల్లా స్థాయిలో ఆర్టీఐ కమిటీలు ఏర్పాటు చేయండి – అధికారులకు కమిషనర్ ఆదేశం

Read Next

25వ డివిజన్ లో కొనసాగుతున్న కోటంరెడ్డి గడప గడపకు కార్యక్రమం

Leave a Reply

Your email address will not be published.