Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేపడుతున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నెల్లూరు 25వ డివిజన్ లో కొనసాగుతుంది. శనివారం బుజబుజ నెల్లూరులోని భగత్ సింగ్ కాలనీలో కోటంరెడ్డి పర్యటించారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం సంక్షేమ పథకాలను వివరించారు. పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. స్థానిక సమస్యలపై ఆరా తీశారు. వాటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానికి కార్పొరేటర్ బద్దెపూడి నరసింహ గిరి తదితరులు పాల్గొన్నారు.
