Clock Of Nellore ( Nellore ) – విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని మాజీ మంత్రి, నారాయణ విద్యా సంస్థల అధినేత డాక్టర్ పొంగూరు నారాయణ నెల్లూరులోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయాన్ని దర్శించారు. సతీమణి రమాదేవితో కలిసి ఆలయానికి చేరుకోగా ఆలయ పాలక మండలి సభ్యులు నారాయణకు స్వాగతం పలికారు. అనంతరం నారాయణ దంపతులు అమ్మవారికి పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర పజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఈ సందర్భంగా ఆయన కాంక్షించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరుజిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అబ్ధుల్ అజీజ్ కూడా ఉన్నారు.
