142వ రోజు : జోరువానలోనూ పవనన్న ప్రజాబాట

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు నగరంలో జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి జోరువానలోనూ పవనన్న ప్రజాబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ( Pavananna Prajabaata ). 142వ రోజైన బుధవారం నెల్లూరు 49వ డివిజన్ సంతపేట పరిధిలోని తూకుమానుమిట్ట ప్రాంతంలో వినోద్ రెడ్డి పర్యటించారు. ఓ పక్క జోరుగా వర్షం కురుస్తున్నా ఇంటింటికి వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారికి విజయదశమి శుభాకాంక్షలు తెలుపుతూ సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి మాట్లాడుతూ ఈ విజయదశమి నుండి ప్రతీ ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని, దుర్గా మాత ఆశీస్సులు అందిరికీ ప్రసాదించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానికి జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Read Previous

నెల్లూరులో మరో మెగా ప్రాజెక్ట్ : శంఖుస్థాపన చేసిన ఎంపి ఆదాల, ఎమ్మెల్యే అనీల్

Read Next

అమ్మ వారిని దర్శించుకున్న మాజీ మంత్రి నారాయణ

Leave a Reply

Your email address will not be published.