Clock Of Nellore ( Nellore ) – నెల్లూరులోని జిల్లా పోలీసు కార్యాలయంలో విజయదశమి వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా ఎస్పీ విజయరావు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వివిధ రకాల పోలీసు ఆయుధాలకు ఎస్పీ ఆయుధ పూజ నిర్వహించారు. అలాగే మోటార్ ట్రాన్స్ పోర్టు విభాగంలోని పోలీసు వాహనాలకు కూడా పూజలు నిర్వహించి జిల్లా పోలీసులకు దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ విజయదశమి నుండి ప్రతీ ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని కాంక్షించారు.
