విఆర్ హైస్కూల్ దేశానికే రోల్ మోడల్ : మంత్రి నారాయణ కుమార్తె షరిణి వెల్లడి

Clock Of Nellore ( Nellore ) – దేశంలోనే రోల్ మోడల్ గా విఆర్ హైస్కూల్ ఉండబోతుందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ కుమార్తె పొంగూరు షరణి తెలిపారు. నెల్లూరు విఆర్ హై స్కూల్ లో జరుగుతున్న అధునీకరణ, పెయింటింగ్ పనులు , గ్రౌండ్ లో ప్లే ఎక్విప్ మెంట్ ఏర్పాట్లు, క్లాస్ రూముల్లో డిజిటల్ ఎక్విప్ మెంట్, ఫర్నిచర్ ఏర్పాటుపై పరిశీలించి ఎన్సిసి సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. అనంతరం పొంగూరు షరీణి మీడియాతో మాట్లాడారు. మా నాన్న నారాయణ పేద కుటుంబం నుంచి వచ్చారని, పేదల కష్టాలు మా కుటుంబానికి బాగా తెలుసన్నారు. విఆర్సీలోనే చదివి మా నాన్న ఉన్నత స్థాయికి ఎదిగారాని ఆమె కొనియాడారు. రాష్ట్రానికి గవర్నర్ ని అందించిన ఘనమైన చరిత్ర నెల్లూరు విఆర్సీకి ఉందని హర్షం వ్యక్తం చేశారు. మూత పడ్డ వీఆర్ హైస్కూల్ ని నిరుపేద పిల్లల కోసం ఆధునీకరించాలని నాన్న సంకల్పిమని, అదే బాధ్యతను తనకు అప్పగించారన్నారు. ఆధునీకరణ పనులు పూర్తి కావొచ్చాయన్నారు. ఇంటర్నేషనల్ స్కూల్స్ కి ధీటుగా వీఆర్సీ రూపుదిద్దుకొంటోందని తెలిపారు. వి ఆర్ హై స్కూల్ లో ఓపెన్ జిమ్ కూడా ఏర్పాటు చేస్తున్నామని, డిజిటల్ విద్యను పేదపిల్లలకు అందుబాటులోకి తెస్తున్నామన్నారు. మంచి వాతావరణంలో విద్యాబోధన అందించడమే లక్ష్యం అన్నారు. ఏపీని డిజిటల్ రాష్ట్రంగా చేయాలన్నది సీఎం చంద్రబాబు , మంత్రి లోకేష్ , మంత్రి నారాయణ సంకల్పం అని వెల్లడించారు. దేశంలోనే రోల్ మోడల్ గా విఆర్సీ ఉండబోతోందని ఘంటాపధంగా చెప్పారు.

Read Previous

ముందుగా గుర్తిస్తే బ్రెయిన్ ట్యూమర్ వ్యాధి నుండి బయటపడవచ్చు : మెడికవర్ వైద్యులు

Read Next

హై రిస్క్ ప్రెగ్నెన్సీ మహిళలకు నెల్లూరు మెడికవర్ లో సురక్షితరమైన కాన్పులు

Leave a Reply

Your email address will not be published.