పిల్లలతో సహా మహిళ అదృశ్యం : గాలిస్తున్న ఆత్మకూరు పోలీసులు

Clock Of Nellore ( Atmakur ) – నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని జేఆర్ పేటలో నివాసం ఉండే సాలగ్రామ శాంతి కుమారి అనే వివాహిత అదృశ్యమైంది. కుటుంబ విషయాల్లో మనస్థాపానికి చెందిన శాంతి కుమారి ఇద్దరు పిల్లలైన 6ఏళ్ల కాశీ విశ్వనాథం, జాహృతితో కలిసి ఇంట్లో నుండి వెళ్లిపోయింది. ఈనెల 21వ నుండి ముగ్గురు కనిపించడం లేదని కుటుంబసభ్యులు ఆత్మకూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి మహిళ, పిల్లల కోసం గాలిస్తున్నారు. వారి ఆచూకీ ఎవరికైనా తెలిస్తే కింది ఫోన్ నంబర్లకు సమాచారం ఇవ్వాలని ఆత్మకూరు ఎస్సై ప్రజలను కోరారు.

ఫోన్ చేయాల్సిన నంబర్లు –
CI Atmakur Circle: 9440796371
SI Atmakur P.S :- 9440796390

Read Previous

కావలిలో మధుసూదన్ అంత్యక్రియలు : నివాళి అర్పించిన డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్

Read Next

నెల్లూరు మేయర్ స్రవంతితో నూతన కమిషనర్ నందన్ భేటీ

Leave a Reply

Your email address will not be published.