
Clock Of Nellore ( Nellore ) – రాష్ట్రంలో పలువురు డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి K. విజయానంద్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా నెల్లూరుజిల్లాకు ఇద్దరు అధికారులు బదిలీపై వచ్చారు. గతంలో నెల్లూరు ఆర్డీఓగా పనిచేసి తర్వాత బదిలీపై వెళ్లి పోస్టింగ్ కోసం వెయిటింగ్ ఉన్న హుస్సేన్ సాహెబ్ ను తెలుగు గంగ స్పెషల్ కలెక్టర్ గా నియమించారు. అలాగే రాజంపేట భూసేకరణ విభాగంలో పనిచేస్తున్న బి. లీలారాణిని నెల్లూరుజిల్లా మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ గా నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.