Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు రూరల్ నియోజకవర్గ హ్యాట్రిక్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పరిపాలనలో తనదైన ముద్రను వేసుకుంటున్నారు. అందరి ఎమ్మెల్యేలకంటే తాను ప్రత్యేకం అని చాటుకుంటున్నారు. పొరుగు రాష్ట్రాలు తెలంగాణా, తమిళనాడు, కర్నాటక రాష్టాల పత్రికలు, మీడియా సైతం అప్పుడప్పుడూ కోటంరెడ్డి వార్తలను ప్రసారం చేస్తున్నాయంటే ఆయన ఎంత విలక్షణ నాయకుడో అర్ధమైపోతుంది. అధికారమా… ప్రతిపక్షమా… అనే తేడా లేకుండా తాను ప్రజా పక్షమంటూ వారి కోసమే అడుగులు ముందుకు వేస్తుంటారు. ఇదే తరుణంలో ప్రపంచంలో ఎక్కడా జరగని కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. ఈనెల 9వ తేదీనా రూరల్ నియోజకవర్గంలో ఒకే రోజు 105 అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపన చేయనున్నారు. 9వ తేదీ ఉదయం 7 గంటల నుండి రాత్రి 10 గంటల మధ్యలో నియోజకవర్గంలోని 105 ప్రాంతాల్లో ఈ శంఖుస్థాపనలు జరగనున్నాయి. కొన్ని కార్యక్రమాలకు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హాజరయినప్పటికీ శంఖుస్థాపనలు మాత్రం స్థానిక ప్రజలే చేస్తారు. ఒకే నియోజకవర్గంలో ఒకే రోజు వందల సంఖ్యలో అభివృద్ధి పనులకు శంఖుస్థాపనలు జరిగిన రికార్డు ఇంత వరకూ ఎక్కడా లేదు. ప్రపంచంలో ఇప్పటి వరకూ ఇలాంటి రికార్డు ఇప్పటి వరకూ నమోదు కాలేదు. మన దేశంలో ఈ తరహా రికార్డు ఇప్పటి వరకూ నమోదు కాలేదు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు, వరల్డ్ రికార్డ్ ఆఫ్ ఇండియా, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ తదితర రికార్డుల జాబితాను పరిశీలించినప్పటికీ ఈ తరహా రికార్డు ఎక్కడా నమోదు కాలేదు. ఇవే కాదు ఏ ఇతర రికార్డుల్లోనూ ఒకే నియోజకవర్గంలో ఒకే రోజు వందకు పైగా అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపనలు జరిగిన రికార్డులు నమోదు కాలేదు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రయత్నిస్తే చారిత్రాత్మక ఈ శంఖుస్థాపనల కార్యక్రమానికి ప్రపంచ రికార్డుల్లోనూ, భారత రికార్డుల్లోనూ చోటు దక్కే అవకాశం ఉంది. ఇటీవల అంటే గతేడాది ఆగస్టు 23వ తేదీనా ఏపిలోని 13వేల 326 పంచాయితీల్లో ఒకే రోజు గ్రామ సభలను నిర్వహించి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రపంచ రికార్డును అందుకున్నారు.
