Clock Of Nellore ( Tirumala ) – తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి రథ సప్తమి వేడుకలు మంగళవారం అంగరంగ వైభవంగా సాగాయి. తెల్లవారు జాము నుంచే ప్రారంభమైన వాహన సేవలు.. భక్తులను తరింపజేశాయి. రథ సప్తమి వేడుకల సందర్భంగా కోవూరు ఎమ్మెల్యే, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తిరుమల శ్రీ వారి వాహన సేవలో పాల్గొన్నారు. తెల్లవారు జామున నిర్వహించిన సూర్య ప్రభ వాహన సేవలో టిటిడి బోర్డు ఛైర్మన్ బి.ఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు, ఇతర బోర్డు సభ్యులతో కలిసి ఆమె వాహన సేవలో పాల్గొని శ్రీ వారి ఆశీస్సులు అందుకున్నారు. రథ సప్తమి ఏర్పాట్లపై ఆయా అధికారులతో ప్రశాంతి రెడ్డి మాట్లాడారు.

Tags: Divya Darshan Tokens in TTD Tirumala Tirupathi Devasthanams TTD TTD Board Member Vemireddy Prasanthi Reddy TTD Radha Sapthami