
Clock Of Nellore ( Nellore ) – రాష్ట్ర దేవాదాయ, ధర్మాధాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణరెడ్డి మంగళవారం నెలూరులోని శ్రీ మూలస్థానేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించారు. రథ సప్తమిని పురస్కరించుకుని ఆలయానికి చేరుకున్న మంత్రికి అధికారులు, అర్చకులు పూర్ణ కుంభ స్వాగతం పలికారు. అనంతరం ఆయన మూలస్థానేశ్వరుడిని దర్శించుకున్నారు. అలాగే శివాలయంలోని శ్రీ సూర్య భగవానుడిని కూడా దర్శించి అభిషేక పూజల్లో పాల్గొన్నారు.