కోటంరెడ్డితో వైసీపి నేత భేటీ : దైవ కార్యక్రమానికి ఆహ్వానం

Clock Of Nellore ( Nellore ) – వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర అధ్యక్షులు సన్నపురెడ్డి పెంచలరెడ్డి సోమవారం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని కలిశారు. వారి కార్యాలయానికి వెళ్లి ఎమ్మెల్యేకు పుష్పగుచ్చం అందజేశారు. రాష్ట్రంలో వైసీపి ఘోర పరాజయం తర్వాత పెంచలరెడ్డి మౌనంగా ఉన్నారు. వైసీపికి, ఆపార్టీ నేతలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఎమ్మెల్యే కోటంరెడ్డిని కలవడం చర్చనీయాంశంగా మారింది. పార్టీ మారుతారా ?, లేదా వైసీపికి దూరంగా ఉంటూనే టిడిపికి సహకరిస్తారా అనేది తెలియాల్సి ఉంది. అదే సందర్భంలో శ్రీధర్ రెడ్డిని దైవ కార్యక్రమానికి ఆహ్వానించారు పెంచలరెడ్డి. అక్టోబర్ 9వ తేదీనా దర్గామిట్టలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం వరకూ జరిగే కలశాల ఊరేగింపు ఉత్సవానికి రావాలని కోటంరెడ్డిని కోరారు.

Read Previous

అక్టోబర్ 3 నుండి ఇరుకళల పరమేశ్వరి ఉత్సవాలు : పోస్టర్ ఆవిష్కరించిన కోటంరెడ్డి

Read Next

ఎమ్మెల్యే కోటంరెడ్డిని కలిసిన ప్రభుత్వ మద్యం గోడౌన్ మేనేజర్ ఆయేషా

Leave a Reply

Your email address will not be published.