ఏపిలో ప్రభుత్వ మద్యం దుకాణాలు రద్దు : 1 నుండి రిటైల్ అమ్మకాలు

Clock Of Nellore ( Amaravathi ) – ఏపిలో గత ఐదేళ్లుగా సాగిన జగన్ సర్కారులో కొనసాగిన ప్రభుత్వం మద్యం దుకాణాలు రద్దయ్యాయి. మద్యం విక్రయాలను రిటైల్ షాపులకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంభందించి రాష్ట్ర గవర్నర్ ఆర్డినెన్స్ ను జారీ చేయడంతో దానికి అనుగుణంగా ప్రభుత్వం గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణాలను రద్దు చేసింది. అక్టోబర్ 1వ తేదీ నుండి మద్యం విక్రయాలను రిటైల్ షాపులకు అంటే ప్రైవేటుకు అప్పగించనున్నారు. ప్రస్తుత మద్యం పాలసీ ఈనెల 30వ తేదీతో ముగియనుంది. 1వ తేదీ నుండి నూతన మద్యం పాలసీ అమలు కానుంది. ఇక నుండి రాష్ట్రంలో ప్రైవేటు లిక్కర్ షాపులే ఉంటాయి. 

Read Previous

ప్రభుత్వ లాంఛనాలతో ముగిసిన మాగుంట పార్వతమ్మ అంత్యక్రియలు

Read Next

మెడికవర్ లో ప్రపంచ గుండె దినోత్సవం : ఆసనాలతో గుండె పదిలం అంటున్న వైద్యులు

Leave a Reply

Your email address will not be published.