Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జన్మదిన వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ఆయన పుట్టిన రోజు సందర్భంగా నెల్లూరులోని వివిధ ప్రాంతాల్లో అభిమానులు, టిడిపి నేతలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. కేకులను కట్ చేసి కోటంరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. నగరంలోని 19వ డివిజన్ రామలింగాపురంలో టిడిపి నేత నూకరాజు మదన్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కోటంరెడ్డి జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యి కేక్ కట్ చేశారు. అలాగే పేదలకు అన్నదానం చేశారు. 20వ డివిజన్ కార్పొరేటర్ చేజర్ల మహేష్ వాత్సల్య అనాథ ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేసి కోటంరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆశ్రమంలోని విద్యార్ధులకు స్వయంగా భోజనం వడ్డించి, వివిధ రకాల పండ్లను అందజేశారు. అలాగే రూరల్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో కోటంరెడ్డి జన్మదిన వేడుకలు జరిగాయి. మరో వైపు జన్మదిన వేడుకలకు ఎమ్మెల్యే కోటంరెడ్డి దూరంగా ఉన్నారు. బెంగుళూరులో ఉన్నారు.
