పిల్లల ఆరోగ్యంపై మెడికవర్ ప్రత్యేక శ్రద్ధ : విద్యార్ధులకు ఉచిత వైద్య పరీక్షలు

Clock Of Nellore ( Nellore ) – నేటి బాలలే రేపటి పౌరులని, అలాంటి బాలల ఆరోగ్యంపై మెడికవర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని అందులో భాగంగా పలు పాఠశాలల్లో ఉచితంగా ఆరోగ్య శిభిరాలు నిర్వహిస్తుందని మెడికవర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డెంటల్ కన్సల్టెంట్ డాక్టర్ కిరణ్మయి రెడ్డి, చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ ఉదయ్ కీర్తి అన్నారు. నెల్లూరు సంతపేటలోని శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం స్కూల్లో బుధవారం మెడికవర్ యాజమాన్యం విద్యార్ధులకు ఉచితంగా ఆరోగ్య పరీక్షలను నిర్వహించారు. స్కూల్ ప్రిన్సిపల్ వి. సురేష్, డీన్ గణేష్, ప్రైమరీ ఇంఛార్జ్ వైష్ణవి, ప్రీ ప్రైమరీ ఇంఛార్జ్ అరుణ ఆధ్వర్యంలో మెడికవర్ డెంటర్ కన్సల్టెంట్ డాక్టర్ కిరణ్మయి రెడ్డి, చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ ఉదయ్ కీర్తి వారి బృందం ఈ వైద్య శిభిరంలో పాల్గొంది. ఇందులో భాగంగా డాక్టర్ కిరణ్మయి రెడ్డి, డాక్టర్ ఉదయ్ కీర్తి స్కూల్ లోని మొత్తం 100 మంది విద్యార్ధులకు దంత పరీక్షలు, ఇతర ఆరోగ్య పరీక్షలను నిర్వహించారు. అవసరమైన వారికి మందులు ఉచితంగా అందజేశారు. అలాగే దంతాల సంరక్షణకు ఎలాంటి ఆహారం తీసుకోవాలని, దంతాల శుభ్రత, ఇతర ఆరోగ్య అంశాలపై విద్యార్ధులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ కిరణ్మయి రెడ్డి, ఉదయ్ కీర్తి మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులు అని, అలాంటి బాలల ఆరోగ్య సంరక్షణపై మెడికవర్ హాస్పిటల్ దృష్ఠి సారించిందని పేర్కొన్నారు. సామాజిక బాధ్యతలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత వైద్య శిభిరాలు నిర్వహిస్తున్నామన్నారు. దంతాలకు సంభందించి సమస్యలు ఎదుర్కొంటున్న పిల్లలను వారి తల్లిదండ్రులు మెడికవర్ హాస్పిటల్ కు తీసుకొస్తే ఉచితంగా వైద్య సేవలు అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ సిబ్బంది, హాస్పిటల్ వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Read Previous

విజయవాడ వరద ప్రాంతాల్లో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి పర్యటన : మంత్రికి చెక్కు అందజేత

Read Next

అపోలో హాస్పిటల్ లో ఫైజర్ అడల్ట్ వ్యాక్సినేషన్ సెంటర్ : ప్రారంభించిన వైద్యులు

Leave a Reply

Your email address will not be published.