కలకత్తా ఘటనపై మెడికవర్ వైద్యుల దిగ్భ్రాంతి : సేవలు నిలిపి నిరసన

Clock Of Nellore ( Nellore ) – కలకత్తాలో ట్రైనీ డాక్టర్ పై జరిగిన అఘాయిత్యానికి నిరసనగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపు నిచ్చిన సమ్మెకు మెడికవర్ హాస్పిటల్స్ పూర్తి మద్దతునిచ్చింది. దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని మెడికవర్ ఆసుపత్రులలో ఓపీ సేవలను శనివారం వైద్యులు బహిష్కరించి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా నెల్లూరులోని హాస్పిటల్ వద్ద మెడికవర్ హాస్పిటల్స్ అధినేత, చైర్మన్ డాక్టర్ అనిల్ కృష్ణ మాట్లాడుతూ ” ఇలాంటి అమానవీయమైన సంఘటనతో దేశం విస్తుపోయింది. యావత్ భారతావని దిగ్భాంతికి లోనయింది. ఈ సంఘటన అందరిని కలిచివేసింది. అత్యంత హేయమైన ఈ ఘటనకు కారకులైన వారిని వెంటనే శిక్షించాలి ” అన్నారు. అలాగే నెల్లూరు మెడికవర్ హాస్పిటల్స్ సెంటర్ హెడ్ డాక్టర్ బిందు రెడ్డి మాట్లాడుతూ ” నేడు దేశమంతా ఏకమై సమైక్య గళం వినిపిస్తున్నది. ఈ సంఘటన అత్యంత భాదాకరమైనది. ఈ సంఘటనను పూర్తిగా ఖండిస్తూ ఈరోజు మేము అందరం బాధితురాలికి మద్దతునిస్తూ మా ఓపీ సేవలను బహిష్కరించాము… అన్నారు. హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డా.యేశ్వత్ రెడ్డి మట్లాడారు ” ప్రజల ప్రాణాలు కాపాడే ఒక డాక్టర్ కు ఇలా జరగడం దారుణాతిదారుణం. ఈ ఘటన నన్నెంతో భాదకు గురిచేసింది, భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండావుండే విధంగా ఈ దారుణానికి ఒడిగట్టిన వారిని శిక్షించాలి, ఆ బంగారుతల్లి ఆత్మ శాంతించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు, నర్సింగ్ సిబ్బంది మరియు సిబ్బంది పాల్గోనారు.

Read Previous

ఎండోస్కోపీ ద్వారా మెదడుకు శస్త్ర చికిత్స : అపోలో హాస్పిటల్ లో విజయవంతం

Read Next

వైసీపికి షాకిచ్చిన ఎమ్మెల్సీ బల్లి : పార్టీకి, పదవికి రాజీనామా

Leave a Reply

Your email address will not be published.