
- మెదడులో రక్త స్రావానికి ఎండోస్కోపీ పద్ధతి ద్వారా శస్త్ర చికిత్స విజయవంతం
- నెల్లూరు అపోలో లో తొలిసారి సక్సెస్ చేసిన ప్రముఖ న్యూరో సర్జన్ డా. వెంకట్
- అభినందించిన అపోలో వైద్య బృందం
Clock Of Nellore ( Nellore ) – నెల్లూరులోని అపోలో స్పెషాలిటీ ఆసుపత్రిలో గురువారం పత్రికా విలేఖరుల సమావేశం జరిగింది. ఈ సమావేశం లో ఆసుపత్రి మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ శ్రీరామ్ సతీష్, అపోలో ఆసుపత్రి న్యూరో సర్జన్ డాక్టర్ వెంకట్ మరియు అనస్తిషియా విభాగాదిపతి డాక్టర్ రాజమోహన్ రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా న్యూరో సర్జన్ డాక్టర్ వెంకట్ మాట్లాడుతూ నెల్లూరు అపోలో సూపర్ స్పెషలిటీ హాస్పిటల్ లో 78 ఏళ్ళ వ్యక్తి మెదడులో రక్త స్రావానికి గురై వారం క్రితం అపోలో హాస్పిటల్ లో చేరారని చెప్పారు. స్కాన్ పరిశీలించిన డాక్టర్లు ఆరుదైన ఆర్టరీవనోస్ మాలీఫార్మాషన్ అనే జబ్బు వల్ల మెదడులో రక్త స్రావం అయినట్లు గుర్తించామన్నారు. సాధారణంగా ఇలాంటి కేసులకు పెద్ద ఆపరేషన్ చేసి చికిత్స చేయవలసి ఉంటుంది. కానీ, పేషెంట్ వయసు 78 ఏళ్ళు కావడంతో పెద్ద ఆపరేషన్ చాలా క్లిష్టమైనది అవుతుంది, ప్రాణాపాయం కూడా ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీనిని పరిశీలించిన వైద్యులు ఎండోస్కోపీ ద్వారా నూతన పద్ధతిలో రక్త స్రావాన్ని తొలగించి ఆర్టరీవనోస్ మాలీఫార్మాషన్ ని నయం చేశారు. పెద్ద ఆపరేషన్ చేసినట్లయితే పేషెంట్ ఒక వారం గాని వెంటిలేటర్ లో ఆ తర్వాత ICU లో ఉండవలసి వచ్చేది. కానీ, ఎండోస్కోపీ పద్ధతి ద్వారా చేసే చికిత్సకి పేషెంట్ ఒక మూడు రోజులలోనే డిశ్చార్జ్ అయ్యి కోలుకున్నాడు. ఈ సమావేశంలో వారితో పాటూ ఆసుపత్రి యూనిట్ హెడ్ బాలరాజు, వైద్యులు పాల్గొన్నారు.