Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు పార్లమెంటు సభ్యునిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీలోని పార్లమెంటు భవనంలో ప్యానల్ ప్రొటెం స్పీకర్ రాధా మోహన్ సింగ్ వేమిరెడ్డిచే ఎంపిగా ప్రమాణ చేయించారు. ప్రమాణ స్వీకారం అనంతరం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి స్పీకర్ ను కలిసి ధన్యవాదాలు తెలియజేశారు. తర్వాత పార్లమెంటు అధికారిక పుస్తకంలో సంతకం చేశారు. మరో వైపు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భాన్ని పురస్కరించుకుని నెల్లూరులో ఆయన అభిమానులు, టిడిపి కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. బాణా సంచా పేల్చి మిఠాయిలు పంచిపెట్టారు. మరో వైపు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్న నేపద్యంలో ఆయన సతీమణి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, కుమారుడు డాక్టర్ అర్జున్ రెడ్డి, నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ మరి కొందరు విపిఆర్ తో కలిసి ఢిల్లీ వెళ్లారు. పార్లమెంటు భవనం సందర్శకుల గ్యాలరీ నుండి వారు విపిఆర్ ప్రమాణ స్వీకారాన్ని తిలకించారు.