అను నేనూ… ప్రమాణ స్వీకారం చేసిన ఉమ్మడి నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేలు

Clock Of Nellore ( Amaravathi ) – ఏపి అసెంబ్లీలో నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎమ్మెల్యేలచే ప్రమాణం చేయించారు. ముందుగా మంత్రులు ప్రమాణం చేయగా, తర్వాత ఎమ్మెల్యేలు చేశారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంభందించిన రాష్ట్ర పురపాలక మంత్రి పొంగూరు నారాయణ ప్రమాణం చేయగా, తర్వాత దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణరెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రుల అనంతరం అక్షర క్రమంలో ఎమ్మెల్యేలు ప్రమాణం చేశారు. కోవూరు ఎమ్మల్యేగా వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, సర్వేపల్లి ఎమ్మెల్యేగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, సూళ్లూరుపేట ఎమ్మెల్యేగా నెలవల విజయశ్రీ, గూడూరు ఎమ్మెల్యేగా పాశిం సునీల్ కుమార్, వెంకటగిరి ఎమ్మెల్యేగా కురుగొండ్ల రామకృష్ణ, ఉదయగిరి ఎమ్మెల్యేగా కాకర్ల సురేష్, కావలి ఎమ్మెల్యేగా దగుమాటి వెంకట కృష్ణారెడ్డి, కందుకూరు ఎమ్మెల్యేగా ఇంటూరి నాగేశ్వర్ రావు ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం ప్రొటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరిని కలిసి ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే వరుసగా మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.

Read Previous

నెల్లూరుజిల్లాలో కేంద్ర కరువు బృందం అధికారులు : పంట నష్టాలపై అంచనాలు

Read Next

సాధారణ కుటుంబం నుండి ప్రస్థానం… కోటంరెడ్డిని చరిత్రలో నిలబెట్టిన వైనం…

Leave a Reply

Your email address will not be published.