మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డిని కలిసిన మెడికవర్ ప్రతినిధులు

Clock Of Nellore ( Nellore ) – రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామ నారాయణరెడ్డిని నెల్లూరులోని మెడికవర్ హాస్పిటల్ ప్రతినిధులు మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఆత్మకూరు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించడమే కాకుండా దేవదాయశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శుభ సందర్భాన్ని పురస్కరించుకొని వారు ఆనంను నెల్లూరులోని వారి నివాసంలో కలిశారు. మెడికవర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సెంటర్ హెడ్ డాక్టర్ ధీరజ్ రెడ్డి, మెడికవర్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ సెంటర్ హెడ్ డాక్టర్ బింధు రెడ్డి, మార్కెటింగ్ మేనేజర్ సతీష్ బాబు, పిఆర్వో చందు వర్మ, ఆత్మకూరు మున్సిపాలిటి కౌన్సిలర్ సూరా భాస్కర్ రెడ్డి తదితరులు రామ నారాయణరెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. శాలువాతో సత్కరించి, బుద్ధ ప్రతిమను అందజేశారు.

Read Previous

ఆదాల ప్రభాకర్ రెడ్డి ఓ మోసగాడు : తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన వై.వి. రామిరెడ్డి

Read Next

ప్రజా నాయకురాలు… కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డికి అభినందనల వెల్లువ

Leave a Reply

Your email address will not be published.