Clock Of Nellore ( Hydarabad ) – ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు గుండె సంబంధిత సమస్యలతో హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ నెల 5న ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడంలో ఆయన్ను ఆసుపత్రిలో చేరారు. ఆరోగ్యం విషమంగా ఉండడంతో శనివారం ఉదయం ఆయన తుది శ్వాస విడిచారు. తెలుగు పత్రికా ప్రపంచంలో నవ శకానికి నాంది ‘ఈనాడు’. 1974 ఆగస్టు 10న విశాఖ సాగరతీరంలో రామోజీరావు ప్రారంభించిన ‘ఈనాడు’ దినపత్రిక తెలుగు నాట ఓ సంచలనం. అణువణువు కొత్తదనంతో, ప్రజల పక్షాన అక్షరయుద్ధంతో ప్రారంభించిన 4ఏళ్లలోనే పాఠకుల మానసపుత్రికగా మారింది. ప్రాంతీయ దిన పత్రికల చరిత్రలోనే కొత్త ఒరవడి సృష్టించింది. జాతీయ స్థాయిలోనూ మీడియా పాత్రపై ఆయన అలుపెరగని పోరాటం చేశారు. రేపు హైదరాబాద్ లోని ఫిలిం సిటీలో రామోజీరావు అంత్యక్రియలు జరగనున్నాయి.

Tags: Ramojirao Died