Clock Of Nellore ( Nellore ) – రుతు పవనాల ప్రభావంతో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఆకాశం మేఘావృతమైంది. గత నెల రోజుల నుండి తీవ్రమైన ఎండ, వడగాల్పులతో సతమతమైన ప్రజలు రుతు పవనాల రాకతో ఊపిరిపీల్చుకున్నారు. రుతు పవనాలు రాయలసీమ మీదుగా ఆదివారం నెల్లూరుజిల్లాలోకి ప్రవేశించాయి. సోమవారం ఉదయం కల్లా జిల్లా వ్యాప్తంగా రుతు పవనాలు వ్యాపించాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా ఆకాశం మేఘావృతమై, వాతావరణం చల్లబడింది. కొన్ని చోట్ల జల్లులు కురిశాయి. సోమవారం ఉదయం నెల్లూరు నగరంలో చిరుజల్లులు కురిశాయి. గత నెల రోజుల నుండి తీవ్రమైన ఎండలతో సతమతమవుతున్న ప్రజలు, వాతావరణం చల్లగా మారడంతో హమ్మయ్య అనుకొన్నారు. రైతు పవనాల ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు వెల్లడించారు.