ఈనెల 22న నెల్లూరుకు గవర్నర్ అబ్ధుల్ నజీర్ రాక : VSU స్నాతకోత్సవానికి హాజరు

Clock Of Nellore ( Nellore ) – రాష్ట్ర గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ ఈనెల 22న నెల్లూరు పర్యటనకు విచ్చేయనున్నట్లు జిల్లా కలెక్టర్‌ ఎం. హరి నారాయణన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. వెంకటాచలం మండలం కాకుటూరులోని విక్రమ సింహపురి యూనివర్శిటీ స్నాతకోత్సవ వేడుకల్లో గవర్నర్‌ పాల్గొంటారు. ఈనెల 22వ తేదీ ఉదయం 9.45 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి ఉదయం 10.40 గంటలకు నెల్లూరు పోలీసు కవాతు మైదానానికి గవర్నర్‌ చేరుకుంటారు. ఉదయం 11.30 గంటలకు విక్రమసింహపురి యూనివర్శిటీలో నిర్వహించే స్నాతకోత్సవ వేడుకల్లో గవర్నర్‌ పాల్గొంటారు. మధ్యాహ్నం 12.55 గంటల వరకు విక్రమ సింహపురి యూనివర్శిటీ స్నాతకోత్సవ వేడుకల్లో గవర్నర్‌ పాల్గొంటారు. అనంతరం సాయంత్రం 5.35 గంటలకు పోలీసు కవాతు మైదానం నుంచి హెలికాప్టర్‌ లో బయలుదేరి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.

Read Previous

చరిత్ర సృష్ఠించేదెవరో … ? – ఈ నలుగురిగే అవకాశం…

Read Next

పోస్ట్ లో వచ్చిన పోస్టల్ బ్యాలెట్ కవర్లు : సీలు వేసి స్ట్రాంగ్ రూములో ఉంచిన కలెక్టర్

Leave a Reply

Your email address will not be published.