Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు రూరల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శనివారం 41వ డివిజన్ లో విస్త్రృత ప్రచారం నిర్వహించారు. స్థానిక టిడిపి నేతలతో కలిసి అరుంధతీపాళెంలో గడప గడపకు తిరిగి సోమవారం జరిగే ఎన్నికల ప్రక్రియలో సైకిల్ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని అభ్యర్ధించారు. భవిష్యత్తు బాగుండాలంటే సైకిల్ కు ఓటు వేయాలన్నారు. అధికారంలోకి రాగానే అమలు చేయనున్న సూపర్ సిక్స్ పథకం ద్వారా మహిళలకు ఎంతో మేలు జరగనుందని గుర్తు చేశారు. ఎమ్మెల్యేగా తనను, ఎంపిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే టిడిపికి ఓటు వేయాలన్న విషయాన్ని మర్చిపోవద్దని కోటంరెడ్డి సూచించారు.
