Clock Of Nellore ( Nellore ) – ప్రచారం ముగింపు సందర్భంగా నెల్లూరు రూరల్ వైసీపి ఎమ్మెల్యే అభ్యర్ధి ఆదాల ప్రభాకర్ రెడ్డి నిర్వహించిన ర్యాలీ అట్టహాసంగా సాగింది. నగరంలోని డైకాస్ రోడ్డు సెంటర్ నుండి బట్వాడి పాళెం సెంటర్ వరకూ నిర్వహించిన ఈ ర్యాలీలో నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఎమ్మెల్యే అభ్యర్ధి ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఎంపి అభ్యర్ధి విజయసాయిరెడ్డి ప్రచార రథంపై ఎక్కి ప్రజలకు అభివాదం చేస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను కోరారు. డైకాస్ రోడ్డు సెంటర్, నిప్పో సెంటర్, వాటర్ ట్యాంక్, పద్మావతి సెంటర్, సారాయి అంగడి సెంటర్, ఎస్పీ బంగ్లా, కలెక్టర్ బంగ్లా, డికేడబ్ల్యు కళాశాల మీదుగా బట్వాడి పాళెం సెంటర్ వరకూ ఈ ర్యాలీ సాగింది. ర్యాలీ సాగిన ప్రాంతం మొత్తం ప్రజలు ఆదాల ప్రభాకర్ రెడ్డికి పూలు చల్లుతూ స్వాగతం పలికారు.

Tags: 2024 Genaral Elections Campaigning for 2024 general elections has ended in AP Nellore Rural TDP Mla Candidate Kotamreddy Sridhar Reddy