Clock Of Nellore ( Vinjamuru ) – ఉదయగిరిలో వైసీపీ ఖాళీ అవుతోంది. చేరికల పరంపర ఇలానే కొనసాగితే.. పోలింగ్ రోజు నాటికి వైసిపికి కనీసం బూత్ ఏజెంట్లు కూడా దొరికే పరిస్థితి ఉండదన్నారు నెల్లూరు ఎంపి టిడిపి అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. వింజమూరు నుంచి ఇంత భారీ సంఖ్యలో పార్టీలో చేరికలు జరగడం చాలా సంతోషంగా ఉందన్నారు. వచ్చేది కూటమి ప్రభుత్వమేనని ప్రజలకు అర్థమైంది కాబట్టే.. వైసిపి జెండాలు పక్కన పడేసి సైకిలెక్కుతున్నారని విపిఆర్ సెటైరిక్ కామెంట్ చేశారు. పార్టీలో చేరినవారికి తగిన ప్రాధాన్యతనిస్తామన్నారు. కొత్త పాత అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. మూడు పార్టీల నాయకులు పరస్పర సమన్వయంతో పని చేయాలని మిత్రపక్ష కూటమి నేతలకు హితబోధ చేశారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు ఉన్నా.. మా దృష్టికి తీసుకురండి. నేను, కాకర్ల సురేష్ మీకు అండగా ఉంటామన్నారు. ఇక మన అంతిమ లక్ష్యం చంద్రబాబు నాయుడును సీఎంగా చేసుకోవడమేనని క్యాడర్లో జోష్ నింపారు. ప్రతి ఒక్కరూ సూపర్ – 6 పథకాలను, మోడీ గ్యారంటీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. చంద్రబాబు సీఎం అయితే ఈ రాష్ట్రానికి జరిగే ప్రయోజనాలను ఇల్లిల్లూ తిరిగి ప్రజలకు వివరించాలన్నారు. కాకర్ల సురేష్ ను ఎమ్మెల్యేగా, తనను ఎంపీగా గెలిపించండి వేమిరెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేయించి ఈ ప్రాంతానికి సాగునీరు తాగునీటి సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తామన్నారు. నడికుడి – శ్రీకాళహస్తి రైల్వే ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేయించడంతో పాటు కేంద్రం నుంచి ప్రత్యేక ప్యాకేజీని తీసుకువచ్చి ఉదయగిరి ప్రాంతానికి అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని హామీ యిచ్చారు. ప్రతి కార్యకర్త క్షేత్రస్థాయిలో పనిచేసి పార్టీని గెలిపించుకోవాలని సూచించారు.
