ఆశీర్వదించండి… అండగా ఉంటాం : విజయసాయిరెడ్డి హామీ

Clock Of Nellore ( Kandukuru ) – గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు ఆర్ఎంపీలు చేస్తున్న సేవలు అభినందనీయమని వైఎస్ఆర్ సిపి నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి విజయసాయిరెడ్డి అన్నారు. కందుకూరు టౌన్ లోని గాయత్రి కళ్యాణ మండపంలో శుక్రవారం మెడికల్ ప్రాక్టీషనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నేతృత్వంలో గ్రామీణ వైద్యులు (ఆర్.ఎం.పి,పి.ఎం.పి)ల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి నెల్లూరు పార్లమెంటు అభ్యర్థి విజయసాయిరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి బుర్రా మధుసూదన్ యాదవ్ లు పాల్గొన్నాను. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో సామాన్య ప్రజలకు వైద్యం అందిస్తున్న ఆర్.ఎం.పి, పి.ఎం.పిల సేవలు అభినందనీయమన్నారు. ఎంబిబిఎస్, ఉన్నత చదువులు చదివిన డాక్టర్లు గ్రామాలలో పనిచేసేందుకు ఆశక్తి చూపరని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆర్.ఎం.పి, పి.ఎం.పిలు గ్రామీణ ప్రాంత డాక్టర్లగా గుర్తింపు పొందారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్.ఎం.పిలు, పి.ఎం.పిలకు శిక్షణ ఇచ్చి వారికి సర్టిఫికేట్ ఇచ్చే అంశంపై కేంద్రం, జాతీయ వైద్య మండలి దృష్టికి తీసుకేళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మీ అసోసియేషన్ కార్యకలాపాలు కొనసాగించేందుకు బిల్డింగ్ కోసం స్థలం కేటాయించే అంశాన్ని ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకేళ్తానని చెప్పారు. మీ సమస్యల పరిష్కారం కోసం నేను, మీ ఎమ్మెల్యే అభ్యర్థి బుర్రా మదుసూదన్ యాదవ్ అందుబాటులో ఉంటామని విజయసాయిరెడ్డి హామి ఇచ్చారు. జగన్ చేసిన మేలును ప్రజలకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.

స్వర్గీయ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రామీణ వైద్యులకు శిక్షణనిచ్చి వైద్యులుగా గుర్తింపునిచ్చారని ఎమ్మెల్యే అభ్యర్ధి బుర్రా మధుసూదన్ యాదవ్ అన్నారు. ముఖ్యమంత్రి జగన్ పేదల పక్షపాతి అని, ఆయనకు మీరు అండగా నిలబడాలని విజ్ఞప్తి చేశారు. మీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని వారికి హామీ ఇచ్చారు.. గ్రామాల్లో కులం, మతం అనే భేదం లేకుండా అందరికి సంక్షేమ ఫలాలను జగన్ అందిస్తున్నారని అన్నారు.. టిడిపి ఇస్తున్న అమలు కాని హామీలపై ప్రజలను అప్రమత్తం చేయాలని వారిని కోరారు.. సిఎం జగన్ చేసిన మేలును ప్రజలకు తెలియజేయాలని వారికి విజ్ఞప్తి చేశారు.మెడికల్‌ ప్రాక్టీషనర్స్ వెల్ ఫేర్ అసోసియేషన్ పరిధిలోని ఆర్.ఎం.పి,పి.ఎం.పిలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Read Previous

చిల్డ్రన్స్ పార్కులో విపిఆర్, నారాయణ : వాకర్స్ తో మాటామంతి

Read Next

తెలుగుదేశం పార్టీకి జై కొట్టిన వాలంటీర్లు : టిడిపిలో చేరిన 40 మంది

Leave a Reply

Your email address will not be published.