స్కిల్ సెంటర్ ను చికెన్ పకోడి సెంటర్ గా మార్చారు : వైసిపిపై నారాయణ మండిపాటు

Clock Of Nellore ( Nellore ) – మ‌హిళ‌లు ఆర్ధికంగా ఎదిగేందుకు టీడీపీ ప్ర‌భుత్వంలో ఏర్పాటు చేసిన‌ స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ సెంట‌ర్‌ని.. చికెన్ ప‌కోడి సెంట‌ర్‌గా మార్చిన ఘ‌న‌త ఒక్క వైసీపీ ప్ర‌భుత్వానికే ద‌క్కుతుంద‌ని మాజీ మంత్రి, టీడీపీ నెల్లూరుసిటీ ఎమ్మెల్యే అభ్యర్థి పొంగూరు నారాయ‌ణ మండిప‌డ్డారు. సార్వ‌త్రిక ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ఆయ‌న నెల్లూరు 42 డివిజన్..ఖుద్దుస్ నగర్ ఆర్చ్ పక్కన…మినీ ఫంక్షన్ హాల్ పరిసర ప్రాంతాల్లో ప‌ర్య‌టించారు. ముందుగా నారాయ‌ణ‌కి డివిజ‌న్ ప్ర‌జ‌లు, తెలుగు త‌మ్ముళ్లు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. డివిజ‌న్‌లోని ప్ర‌తీ ఇంటికెళ్లి… తెలుగుదేశం ప్ర‌భుత్వంలో జ‌రిగిన అభివృద్దిని ప్ర‌జ‌ల‌కి వివ‌రించారు. రానున్న ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లంద‌రూ సైకిల్ కి వేసి…టీడీపీ ప్ర‌భుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాల‌ని కోరారు.

అనంత‌రం డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ మీడియాతో మాట్లాడారు. 2019లో జ‌రిగిన రొట్టెల పండుగ‌కి సుమారు 20 ల‌క్ష‌ల మందికి పైగా భ‌క్తులు వ‌చ్చార‌న్నారు. ఆ స‌మ‌యంలోనే ముఖ్య‌మంత్రిగా ఉన్న నారా చంద్ర‌బాబు నాయుడుని రొట్టెల పండుగ‌కు తీసుకురావ‌డం జ‌రిగింద‌ని, ఆయ‌న అప్ప‌టిక‌ప్పుడే ద‌ర్గా అభివృద్ధికి మ‌రో రూ. 20 కోట్ల‌ను మంజూరు చేయ‌డం జ‌రిగింద‌న్నారు. సార్‌…మా ముస్లిం నిరుపేద‌లంద‌రూ వివాహాలు, శుభ‌కార్యాలు చేసుకునేందుకు షాదీమంజిల్ కానీ…ఫంక్ష‌న్ హాల్ కావాల‌ని….అబ్ధుల్ అజీజ్ అడ‌గ‌డం జ‌రిగింద‌న్నారు, అప్ప‌టిక‌ప్పుడే రూ. 8 కోట్ల రూపాయ‌లు మంజూరు చేసి… షాదీ మంజిల్ కి శ్రీ‌కారం చుట్టామ‌న్నారు. మా ప్ర‌భుత్వ హ‌యాంలోనే షాదీ మంజిల్ ఎంతో అద్భుతంగా నిర్మించార‌ని… దానిని చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంద‌న్నారు. అయితే…ప‌లువురు ముస్లిం సోద‌రులు…సార్ షాదీమంజిల్ లో పెళ్లి చేసుకోవాలంటే సుమారు రూ. 60వేల నుంచి 70వేల వ‌ర‌కు ఖ‌ర్చ‌వుతుంద‌ని…మేము అంత పెట్టుకోలేమ‌ని నా దృష్టికి తీసుకువ‌చ్చార‌న్నారు. ఖ‌చ్చితంగా నేను అధికారంలోకి రాగానే… మీ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తాన‌ని ముస్లిం సోద‌రుల‌కి నారాయ‌ణ హామీ ఇచ్చారు. అదే విధంగా నెల్లూరు న‌గ‌రంలో చ‌క్క‌టి ఎండ్ టూ ఎండ్‌ రోడ్ల‌ను వేయ‌డం జ‌రిగింద‌న్నారు. ముస్లిం ఆడ పిల్ల‌ల కోసం కాలేజ్‌ని కూడా ఏర్పాటు చేయ‌డం జ‌రిగింద‌న్నారు. మా ప్ర‌భుత్వం అధికారంలో ఉన్న‌ప్పుడు ప్ర‌జ‌ల అవ‌స‌రాల‌న్నీ తీర్చామ‌న్నారు. రూ. 2 కోట్ల‌తో మ‌హిళ‌ల కోసం గోషా హాస్పిట‌ల్ ను కూడా ఏర్పాటు చేశాన‌ని…ఇలా నేను మంత్రిగా ఉన్న సమ‌యంలో ఎన్నో కార్య‌క్ర‌మాలు చేశాన‌ని గుర్తు చేశారు. నిరుపేద‌ల‌కి రూ. 5ల‌కే క‌డుపు నిండా అన్నం పెట్టే అన్న క్యాంటీన్ల‌ను టీడీపీ ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చింద‌న్నారు. వాటిని కూడా జ‌గ‌న్ ప్ర‌భుత్వం మూసేసి నిరుపేద‌ల క‌డుపు కొట్టింద‌న్నారు. రానున్న ఎన్నిక‌ల్లో న‌న్ను ఎమ్మెల్యేగా, ఎంపీగా వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాల‌ని ఆయ‌న అభ్య‌ర్థించారు. ఎంపీగా వేమిరెడ్డి గెలిస్తే…కేంద్రం నుంచి నిధులు తీసుకురావ‌డంతోపాటు…నేను గెలిస్తే…రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు తీసుకువ‌చ్చి… నెల్లూరు న‌గ‌రాన్ని భార‌త‌దేశంలోనే నెం.1 స్మార్ట్ సిటీగా చేసి చూపిస్తామ‌ని అలాగే… నిరుపేద‌లు ఆర్ధికంగా ఎదిగేందుకు కృషి చేస్తామ‌ని చెప్పారు. ప్ర‌జ‌లంద‌రూ ఆలోచించి…మీ అమూల్య‌మైన ఓటుని సైకిల్ గుర్తుపై వేసి…మా ఇద్ద‌రిని అఖండ మెజారిటీతో గెలిపించాల‌ని ప్ర‌జ‌ల్ని అభ్య‌ర్థించారు.

Read Previous

టిడిపిలోకి కొనసాగుతున్న చేరికలు : ఆహ్వానిస్తున్న కోటంరెడ్డి

Read Next

వచ్చేది టిడిపి ప్రభుత్వమే : విపిఆర్ సమక్షంలో భారీగా చేరికలు

Leave a Reply

Your email address will not be published.