Clock Of Nellore ( Nellore ) – వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నెల్లూరు మాగుంట లే అవుట్ లోని ఆ పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. పార్టీ జిల్లా అధ్యక్షులు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు నెల్లూరు ఎంపి ఆదాల ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎంపి మేకపాటి రాజమోహన్ రెడ్డి, నగర మేయర్ స్రవంతి, డిసిసిబి మాజీ ఛైర్మైన్ ఆనం విజయకుమార్ రెడ్డి, వైసిపి నగర అధ్యక్షులు సన్నపురెడ్డి పెంచలరెడ్డి, పలువురు కార్పొరేటర్లు, నేతలు హాజరయ్యారు. ముందుగా అక్కడ ఏర్పాటు చేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించి, కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అత్యున్నత లక్ష్యాలతో పార్టీని స్థాపించి నేడు ముఖ్యమంత్రిగా అన్నీ వర్గాల ప్రజల మన్ననలను అందుకుంటున్నారని కొనియాడారు. త్వరలో జరిగే ఎన్నికల్లో ప్రతీ కార్యకర్త గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
