సోమవారం తర్వాత ఏ క్షణమైనా… ఎన్నికల నోటిఫికేషన్… !

Clock Of Nellore ( Delhi ) – సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తును పూర్తి చేసింది. సోమవారం తర్వాత ఏ రోజైనా నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. పార్లమెంటు ఎన్నికలతో పాటూ ఆంధ్రప్రదేశ్ తో సహా మరి కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం ఈ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. బుధవారం లోపు నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. మొత్తం నాలుగు విడతల్లో ఎన్నికలను నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించినట్లు తెలిసింది. ఈనెలలోనే నామినేషన్ల ప్రక్రియ ఉంటుందని అంటున్నారు. ఏప్రిల్ నెలలోనే మొత్తం నాలుగు విడతల పోలింగ్ ప్రక్రియను పూర్తి చేసి మే నెల రెండో వారంలోగా లెక్కింపు ప్రక్రియను కూడా పూర్తి చేసే విధంగా నోటిఫికేషన్ ను రూపొందించినట్లు తెలుస్తోంది. 

Read Previous

ఇంతటి బరితెగింపా … ? – పోలీసుల తనిఖీలపై ఎమ్మెల్యే కోటంరెడ్డి ఆగ్రహం

Read Next

నెల్లూరుకు చేరుకున్న కేంద్ర బలగాలు…

Leave a Reply

Your email address will not be published.