ఆనంతో విపిఆర్ భేటీ : పదికి పది స్థానాల కైవసంపై చర్చ

Clock Of Nellore ( Nellore ) – టిడిపి నేత, మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డితో రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భేటీ అయ్యారు. సోమవారం నెల్లూరు సంతపేటలోని ఆనం నివాసానికి వేమిరెడ్డి వెళ్లగా ఆనం స్వాగతం పలికారు. వేమిరెడ్డితో పాటూ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, కాటంరెడ్డి రవీంద్ర రెడ్డి తదితరులు కూడా వెళ్లారు. అనంతరం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి ఏకాంతంగా మాట్లాడుకున్నారు. జిల్లాలో రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ఉమ్మడి నెల్లూరుజిల్లాలోని పది సీట్లతో పాటూ నెల్లూరు పార్లమెంటు పరిధిలో ఉన్న కందుకూరును సైతం టిడిపి కైవసం చేసుకోనేలా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లాలని చర్చించారు. అలాగే నెల్లూరు పార్లమెంటు స్థానం నుండి పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గతంలో ఎవ్వరికీ రాని విధంగా భారీ మెజార్టీ వచ్చే విధంగా ఆనంతో చర్చలు జరిపారు.

Read Previous

కందుకూరు వ్యవహారం : రంగంలోకి దిగిన విజయసాయి రెడ్డి

Read Next

నారాయణ మద్దతుదారుల నివాసాల్లో పోలీసుల తనిఖీలు : కోటి 81 లక్షల సీజ్

Leave a Reply

Your email address will not be published.