Clock Of Nellore ( Nellore ) – మాజీ మంత్రి నారాయణకు నెల్లూరు నగర ప్రజలంతా కొండంత అండగా ఉన్నారని, ఈ సారి ఆయన్ను గెలిపించుకుంటామంటూ ప్రజలే తనకు స్వచ్ఛంధంగా చెబుతున్నారని నారాయణ సతీమణి పొంగూరు రమాదేవి పేర్కొన్నారు. నెల్లూరు 40వ డివిజన్ లో ఆమె ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. స్థానిక టిడిపి, జనసేన నేతలతో కలిసి మూలాపేట, వాకర్స్ రోడ్డు తదితర ప్రాంతాల్లో గడప గడపకు తిరిగారు. వచ్చే ఎన్నికల్లో టిడిపికి ఓటు వేసి నారాయణను గెలిపించాలని ఓటర్ల అభ్యర్ధించారు. గడప గడపకూ వెళ్లిన రమాదేవిని ప్రజలు విశేషంగా ఆదరిస్తూ ఈ దఫాను నారాయణను గెలిపించుకుంటామని హామీ ఇస్తున్నారు. 2014 నుండి 2019 వరకూ నెల్లూరు సిటీలో నారాయణ చేసిన వివిధ అభివృద్ధి పనులను ఆమె ఓటర్లకు వివరించారు. ప్రస్తుత వైసీపి ప్రభుత్వంలో అభివృద్ధి జరగలేదని, నారాయణను గెలిపిస్తే నిలిచిపోయిన అభివృద్ధి పనులను పూర్తి చేస్తారని పేర్కొన్నారు. పొంగూరు రమాదేవి ప్రచారం చేస్తున్న క్రమంలో ఓ ఆటో కార్మికుడు తన ఆటో ఎక్కాలని కోరగా, ఆమె డ్రైవింగ్ సీట్లో కూర్చుని కొద్ది దూరం ఆటోను డ్రైవ్ చేసి కార్యకర్తలను ఉత్సాహ పరిచారు.
అనంతరం రమాదేవి మీడియాతో మాట్లాడుతూ 40వ డివిజన్ లో ఏ ఇంటికెళ్లినా ప్రజలు అపూర్వ స్వాగతం పలుకుతున్నారని, గెలిచేది నారాయణే అని తమకు కొండంత ధైర్యాన్ని ఇస్తూ ఉత్సాహపరుస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో వైసీపికి ఒక్క ఛాన్స్ ఇచ్చి తప్పు చేశామని, త్వరలో జరిగే ఎన్నికల్లో ఆ తప్పు చేయబోమని ప్రజలు చెబుతున్నట్లు వెల్లడించారు. నెల్లూరులో నారాయణ విజయం సాధించి, టిడిపి ప్రభుత్వం రాగానే నెల్లూరులో పెండింగ్ లో ఉన్న అన్నీ పనులనూ పూర్తి చేస్తామని రమాదేవి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గండవరం నాని, గుమ్మడి రాజేశ్వరి, తుమ్మల కృష్ణ, అమ్మణ్ణి, చలమల శీనయ్య తదితరులు పాల్గొన్నారు.
