తెలుగుదేశం పార్టీలో చేరిన పసుపులేటి విజయలక్ష్మి

Clock Of Nellore ( Nellore ) – కాపు సంఘం నేత, మాధవయ్య అండ్ సన్స్ ఫర్నీచర్స్ అధినేత పసుపులేటి విజయకుమార్ కుమార్తె విజయలక్ష్మి తెలుగుదేశం పార్టీలో చేరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న ఆమె టిడిపి నేత, మాజీ మంత్రి పొంగూరు నారాయణ సమక్షంలో పసుపు కండువా కప్పుకున్నారు. విజయలక్ష్మిని నారాయణ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించి శుభాకాంక్షలు తెలియజేశారు. విజయలక్ష్మి తండ్రి పసుపులేటి విజయకుమార్ తో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా నారాయణ గుర్తు చేసుకున్నారు. విజయకుమార్ తో తనకు ఎంతో సాన్నిహిత్యం ఉందని, ఏ సమస్య వచ్చినా ప్రజల కోసం ముందుండే వ్యక్తి విజయకుమార్ అని నారాయణ పేర్కొన్నారు. తండ్రి బాటలో నడుస్తూ ప్రజాసేవ చేసేందుకు ముందుకొచ్చిన విజయలక్ష్మికి తన సహకారం ఎప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ ద్వారా తండ్రి ఆశయాన్ని నెరవేర్చాలని ఆమెకు సూచిస్తూ, ఆ ప్రయాణంలో తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

Read Previous

గడప గడపకు కోటంరెడ్డి కుటంబం : టిడిపికి ఓటు వేయాలని విన్నపం

Read Next

భార్య కళ్లెదుటే భర్త దారుణ హత్య : నెల్లూరులో దుండగుల కిరాతకం

Leave a Reply

Your email address will not be published.