గడప గడపకు కోటంరెడ్డి కుటంబం : టిడిపికి ఓటు వేయాలని విన్నపం

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కుటుంబసభ్యులు విస్త్రృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలోని ప్రతీ ప్రాంతంలో పర్యటిస్తూ గడప గడపకూ వెళ్తున్నారు. శ్రీధర్ రెడ్డి సతీమణి కోటంరెడ్డి సుజిత, కుమార్తెలు హైందవి, వైష్ఠవిలు ప్రతీ ఒక్కర్నీ కలుస్తూ వచ్చే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి శ్రీధర్ రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఆదివారం 18వ డివిజన్ పరిధిలోని హరనాథపురం పీపుల్స్ పార్క్ ప్రాంతంలో వారు పర్యటించారు. ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేశారు. ప్రజకు నిత్యం అందుబాటులో ఉండే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్ధించారు.

Read Previous

వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపిన కొమ్మరపూడి రైతులు

Read Next

తెలుగుదేశం పార్టీలో చేరిన పసుపులేటి విజయలక్ష్మి

Leave a Reply

Your email address will not be published.