NAMS ఫెలోషిప్ ను అందుకున్న డాక్టర్ బింధు మీనన్

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు అపోలో హాస్పిటల్ న్యూరాలజీ సీనియర్ కన్సల్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బింధు మీనన్ ప్రతిష్ఠాత్మక నేషనల్ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ( NAMS ) ఫెలోషిప్ ను అందుకున్నారు. బెంగుళూరులోని NAMS లో జరిగిన 63వ వార్షికోత్సవంలో భాగంగా డాక్టర్ బింధు మీనన్ ఈ పురస్కారాన్ని అందుకున్నారు. అకడమిక్ ఎక్సలెన్స్, పరిశోధన, ప్రచురణలు, కాన్ఫరెన్స్ లలో ప్రదర్శన, సైంటిఫిక్ కమిటీలో పదవులు, సమాజసేవ అనే అంశాలను పరిగణలోకి తీసుకున్న నేషనల్ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డాక్టర్ బింధు మీనన్ ను ఫెలోఫిక్ కు ఎంపిక చేసి అందజేసింది. ఈ కార్యక్రమంలో కర్నాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్, కర్నాటక ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, ప్రొఫెసర్ ఎస్పీ సింగ్ బఘెల్, భారత సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి ఎస్.కె. సరిన్ తదితరులు పాల్గొన్నారు.

Read Previous

మధుమేహంతో కంటి సమస్యలు : జాగ్రత్తలు తెలియజేసిన మెడికవర్ వైద్యులు

Read Next

విజయమే లక్ష్యంగా పనిచేయండి : మాజీ మంత్రి నారాయణ పిలుపు

Leave a Reply

Your email address will not be published.