దౌర్జన్య రాజకీయాలు ఎక్కువ కాలం సాగవు : జగన్ కు ఎమ్మెల్యే కోటంరెడ్డి హెచ్చరిక

Clock Of Nellore ( Nellore ) – అక్రమ అరెస్టులు, వేధింపులు, నిర్భంధాలు, లాఠీలు, దౌర్జన్యాలతో చేసే రాజకీయాలు ఎక్కువ కాలం సాగవని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డారు. అధికారంలో ఉన్న వ్యక్తులు ప్రజలకు మేలు చేస్తే ప్రజలు హర్షిస్తారని పేర్కొన్నారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ నెల్లూరులోని తన కార్యాలయంలో 11వ రోజూ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా నాయి బ్రాహ్మణులు పాల్గొని వాయిధ్యాలు వాయిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టిడిపి నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తదితర నేతలు బాబుతో నేను అంటూ ప్లకార్డులు ప్రదర్శించి చంద్రబాబుకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా సిఎం జగన్ పై ఎమ్మెల్యే కోటంరెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కక్ష పూరిత రాజకీయాలు చేస్తున్న జగన్… రాష్ట్రాన్ని మరో బీహార్ గా మారుస్తున్నారని విమర్శించారు. ఇలాంటి రాజకీయాలు ఎక్కువ కాలం సాగవని, ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారని, త్వరలోనే ఓటుతో జగన్ కు బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. కుట్ర పూరిత రాజకీయాల్లో భాగంగానే చంద్రబాబును అరెస్టు చేశారని, ఆయన కడిగిన ముత్యంలా బయటకు వస్తారని, 2024 ఎన్నికల్లో ముఖ్యమంత్రి పీఠం అధిరోహించడం ఖాయమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు దొడ్డపనేని రాజా నాయుడు, జెన్ని రమణయ్య, ఈదర శ్రీనివాసులు, చేజర్ల మహేష్, జలదంకి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

Read Previous

ఘనంగా తిరుమల శ్రీవారి గరుడ మహోత్సవం : భారీగా తరలివచ్చిన భక్త జనం

Read Next

వైసీపిలోకి కేతంరెడ్డి వినోద్ రెడ్డి : సిఎం సమక్షంలో త్వరలో చేరిక

Leave a Reply

Your email address will not be published.