Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో వినాయక చవితి పండుగ సంధర్భంగా కార్పొరేషన్ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విగ్రహ ప్రతిష్ట, పూజా కార్యక్రమాల్లో మేయర్ పొట్లూరి స్రవంతి, కమిషనర్ వికాస్ మర్మత్ సోమవారం పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ప్రజలు చేపట్టిన కార్యక్రమాలు విఘ్నేశ్వరుని ఆశీర్వాదంతో విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. కార్పొరేషన్ లో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజలు నిర్వహించడం శుభ పరిణామం అని సంతోషం వ్యక్తం చేశారు. ప్రజలంతా భక్తి శ్రద్ధలతో ఆనందోత్సాహాల నడుమ వినాయక చవితి పండుగను జరుపుకోవాలని కోరుతూ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, కార్పొరేటర్లు సత్తార్, కరిముల్లా, కో ఆప్షన్ మెంబర్ మొబినా, నగర పాలక సంస్థ అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొని తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు.
