Clock Of Nellore ( Nellore ) – వినాయక చవితి సందర్భంగా కాలుష్యానికి తావు లేకుండా ప్రతీ ఒక్కరూ వినాయక మట్టి విగ్రహాలనే పూజించాలని జేడి ఫౌండేషన్ సభ్యులు గాజుల సాగర్ ప్రజలను కోరారు. సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ స్పూర్తితో స్థాపించిన జేడి ఫౌండేషన్ ద్వారా సాగర్ నెల్లూరులో భక్తులకు మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. జేడి లక్ష్మీ నారాయణ ఆశయ సాధనాల కోసం జేడి ఫౌండేషన్ పనిచేస్తుందని గాజుల సాగర్ తెలియజేశారు. ఆయన స్పూర్తితోనే పర్యాపరణాన్ని కాపాడేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు.