చంద్రబాబు అరెస్టుపై ఆందోళనలు : రాష్ట్ర వ్యాప్తంగా నిరాహార దీక్షలు

Clock Of Nellore ( Nellore ) – మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించింది. బాబుకు తోడుగా మేము సైతం అంటూ నియోజకవర్గాలు, మండల కేంద్రాల్లో నిరాహార దీక్షలు చేపట్టింది. నెల్లూరుజిల్లా వ్యాప్తంగా కూడా నేతలు నిరాహార దీక్షలు చేపట్టారు. నెల్లూరు సిటీలోని గాంధీబొమ్మ సెంటర్ వద్ద కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి, చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి, తాళ్లపాక అనురాధ తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంభందించి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కార్యాలయంలో నిరాహార దీక్షలు జరిగాయి. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరాహార దీక్షలకు నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి, టిడిపి నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కూడా ఈ దీక్షల్లో పాల్గొన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కావలి పట్టణంలో మాలేపాటి సుబ్బానాయుడు ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు చేపట్టారు. ఉమ్మడి నెల్లూరుజిల్లాలోని అన్నీ నియోజకవర్గాలు, మండల కేంద్రాల్లో చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ఆందోళనా కార్యక్రమాలను నిర్వహించారు.

 

Reporter – P. Eswar

 

Read Previous

ఓట్ల తొలగింపుపై ఎన్నికల అధికారి సమీక్ష : పాల్గొన్న నెల్లూరు కలెక్టర్

Read Next

ఎమ్మెల్యే కోటంరెడ్డికి షాకిచ్చిన మేయర్ స్రవంతి : వైసీపిలో కొనసాగేందుకు నిర్ణయం

Leave a Reply

Your email address will not be published.