నెల్లూరుజిల్లాలో బంద్ ప్రశాంతం : మూడో రోజు కొనసాగిన నేతల గృహ నిర్భంధాలు

Clock Of Nellore ( Nellore ) – మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ ను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ చేపట్టిన బంద్ ఉద్రిక్తంగా సాగింది. కొన్ని చోట్ల నేతలు ఆందోళనలు నిర్వహించిన నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. నెల్లూరుజిల్లాలో బంద్ ప్రశాంతంగా సాగింది. అనేక చోట్ల టిడిపి కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారు. నెల్లూరు నగరంతో సహా అనేక పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో కొందరు దుకాణాలను స్వచ్ఛంధంగా మూసివేసి బంద్ కు సంఘీభావం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు పాఠశాలలు మూత బడ్డాయి. అనేక చోట్ల ప్రభుత్వ కార్యాలయాలను నేతలు మూయించారు. నెల్లూరులో మాజీ మంత్రి పొంగూరు నారాయణను, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలను 3వ రోజూ పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో వారు ఇళ్లకే పరిమితమయ్యారు. వారే కాకుండా టిడిపి నేతలు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డితో సహా జనసేన నేతలను కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కావలి పట్టణంలో టిడిపి నేతలతో పాటూ జనసేన నేతలను అరెస్ట్ చేశారు. వరికుంటపాడులో టిడిపి కార్యకర్తలు సిఎం జగన్ ఫ్లెక్సీని దహనం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి స్వయంగా రోడ్లపై తిరుగుతూ శాంతి భద్రతలను పరిశీలించారు. రోడ్లపై పోలీసులు భారీగా మోహరించారు. 

 

Reporter – P. Eswar

Read Previous

నెల్లూరులో గణేష్ ఉత్సవ ఏర్పాట్లు : సమీక్ష నిర్వహించిన కలెక్టర్, ఎంపి ఆదాల

Read Next

పోలీసుల తీరుపై మండిపడ్డ ఎమ్మెల్యే కోటంరెడ్డి : వెనక్కు తగ్గిన పోలీసులు

Leave a Reply

Your email address will not be published.