పోలీసుల తీరుపై మండిపడ్డ ఎమ్మెల్యే కోటంరెడ్డి : వెనక్కు తగ్గిన పోలీసులు

Clock Of Nellore ( Nellore ) – పోలీసుల తీరుపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మండిపడ్డారు. గత మూడు రోజులుగా తన వల్ల నెల్లూరు మాగుంట లే అవుట్ లో స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హౌస్ అరెస్ట్ పేరుతో గత మూడు రోజులుగా తన నివాసం ఉన్న ప్రాంతం చుట్టుపక్కల బారీకేడ్లు ఏర్పాటు చేసి ఎవ్వర్నీ అనుమతించడం లేదని దీని వల్ల స్థానికంగా నివాసం ఉండే వారు తీవ్ర అసౌకర్యానికి గురౌతున్నారని పేర్కొన్నారు. వరుసగా మూడో రోజైన సోమవారం దర్గామిట్ట పోలీసులు మాగుంట లే అవుట్ లోని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. టిడిపి బంద్ నేపద్యంలో హౌస్ అరెస్ట్ చేస్తున్నట్లు తెలియజేసి నోటీసు తీసుకోవాల్సిందిగా కోరారు. దీనిపై కోటంరెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గత మూడు రోజులుగా హౌస్ అరెస్ట్ పేరుతో తన నివాసం చుట్టుపక్కల బారీకేడ్లు ఏర్పాటు చేసి ఎవ్వర్నీ అనుమతించడం లేదని అన్నారు. తన వ్యక్తిగత సిబ్బందిని సైతం అడ్డుకుంటున్నారన్నారు. తన వల్ల స్థానికులు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను తన కార్యాలయానికి వెళ్తే స్థానిక ప్రజలకు ఇబ్బంది ఉండదని తెలియజేశారు. దానికి పోలీసులు అంగీకరించకపోవడంతో కోటంరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే తనను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లాలని, అవసరమైతే లాకప్ లో అయినా పెట్టండని స్పష్టం చేశారు. చివరకు నెల్లూరు నగర డిఎస్పీ శ్రీనివాసులు రెడ్డి కోటంరెడ్డి నివాసం వద్దకు చేరుకున్నారు. హౌస్ అరెస్ట్ నోటీసు తీసుకోవాలని కోరగా కోటంరెడ్డి తిరస్కరించారు. చివరకు డిఎస్పీ వెనక్కు తగ్గి బారీ కేడ్లు తొలగిస్తామని, స్థానికులకు ఇబ్బంది లేకుండా కేవలం మీ ఇంటి వద్ద మాత్రమే పోలీసులు ఉండేలా చూస్తమని హామీ ఇవ్వడంతో కోటంరెడ్డి శాంతించారు. ఆ తర్వాత హౌస్ అరెస్ట్ నోటీసు తీసుకున్నారు. తరువాత పోలీసులు బారీకేడ్లు తొలగించారు.

 

Reporter – P. Eswar

Read Previous

నెల్లూరుజిల్లాలో బంద్ ప్రశాంతం : మూడో రోజు కొనసాగిన నేతల గృహ నిర్భంధాలు

Read Next

నెల్లూరు ట్రాఫిక్ సిఐగా బాధ్యతలు చేపట్టిన వేమారెడ్డి

Leave a Reply

Your email address will not be published.