నెల్లూరు జిల్లా బిజేపి అధ్యక్షునిగా వంశీధర్ రెడ్డి నియామకం

Clock Of Nellore ( Nellore ) – భారతీయ జనతా పార్టీ నెల్లూరుజిల్లా అధ్యక్షునిగా వంశీధర్ రెడ్డి నియమితులైనారు. ఆయన్ను జిల్లా అధ్యక్షునిగా నియమిస్తూ పార్టీ ఏపి అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ముత్తుకూరు మండలానికి చెందిన వంశీధర్ రెడ్డి గత 20 ఏళ్లుగా బిజేపిలో కొనసాగుతున్నారు. ఆర్.ఎస్.ఎస్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే వంశీధర్ రెడ్డి సాధారణ కార్యకర్త స్థాయి నుండి పనిచేశారు. ఏబివిపితో పాటూ బిజేపి జిల్లా కమిటిలో కూడా పనిచేశారు. తాజాగా ఆయన పార్టీ జిల్లా అధ్యక్షునిగా నియమితులైనారు. ఆయన నియామకంపై బిజేపి నేతలు, కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేశారు. ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.

Reporter – P. Eswar

Read Previous

కావలిలో ఫ్లెక్సీల రగడ : తాకితే గొంతు కోసుకుంటానన్న టిడిపి నేత

Read Next

నెల్లూరులో గణేష్ ఉత్సవ ఏర్పాట్లు : సమీక్ష నిర్వహించిన కలెక్టర్, ఎంపి ఆదాల

One Comment

  • Your website delivered the news very fast

Leave a Reply

Your email address will not be published.