తేడా గమనించండి… టిడిపిని గెలిపించండి : మహిళా మణులకు కోటంరెడ్డి విజ్ఞప్తి

Clock Of Nellore ( Nellore ) – వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు, అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యావసర వస్తువుల ధరలు ఎలా ఉన్నాయో ఒక్క సారి తేడాను గమనించాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మహిళలకు విజ్ఞప్తి చేశారు. ఏ రంగంలోనైనా ముందుకు వెళ్లాలన్నా, ప్రగతి సాధించాలన్నా ఒక్క తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. బుధవారం నెల్లూరు రూరల్ మండలంలోని పొట్టేపాళెంలో టిడిపి మేనిఫెస్టోలోని మహిళ పథకాలను వివరించే మహాశక్తి చైతన్య రథయాత్రను ఎమ్మెల్యే కోటంరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు మున్సిపల్ మాజీ ఛైర్మైన్ తాళ్లపాక అనురాధ, టిడిపి నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, టిడిపి మహిళా నాయకులు పాల్గొన్నారు. రథయాత్ర ప్రారంభోత్సవం సందర్భంగా మహిళలతో ఏర్పాటు చేసిన సభలో కోటంరెడ్డి మాట్లాడారు. చంద్రబాబు ఎప్పుడూ మహళా పక్షపాతిగా ఉంటారని గుర్తు చేశారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే 18 ఏళ్లు నిండిన ప్రతీ మహిళకూ ఆడబిడ్డ నిధి కింద నెలకు 1500 రూపాయలు ఇవ్వనున్నారని, తల్లికి వందనం పేరుతో ఎలాంటి షరతులు లేకుండా ఇంట్లో చదువుకునే ప్రతీ బిడ్డకూ సంవత్సరానికి 15వేల చొప్పున అందజేయనున్నారని తెలిపారు. అంతే కాకుండా దీపం పేరుతో ప్రతీ ఇంటికీ ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వనున్నారని, జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తారన్నారు. రాష్ట్రంలో వైసీపి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిత్యావసర వస్తువులు ఆకాశాన్ని అంటుతున్నాయని, చంద్రబాబు, జగన్ ప్రభుత్వాల మధ్య తేడాను మహిళలు గమనించి వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుండి తనను ఆశీర్వదించాలని వేడుకున్నారు.

 

Read Previous

ఇంటి వద్దకే పౌష్ఠికాహారం : సంపూర్ణ పోషణ ప్రారంభించిన జేసి కూర్మనాథ్

Read Next

ముగిసిన బారాషహీద్ దర్గా రొట్టెల పండుగ : అధికారులకు ఎంపి ప్రశంసలు

Leave a Reply

Your email address will not be published.