Clock Of Nellore ( Nellore ) – మాజీ మంత్రి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామ నారాయణరెడ్డికి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. సోమవారం ఆనం పుట్టిన రోజు కావడంతో చంద్రబాబు ట్విట్టర్ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజల ఆశీర్వాదబలంతో నిండు నూరేళ్లూ ఆనందారోగ్యాలతో వర్దిల్లాలని ఆకాంక్షించారు. మరో వైపు పలువురు అభిమానులు కూడా నెల్లూరులోని వారి నివాసంలో ఆనం ను కలిసి పుష్పగుచ్చాలు సమర్పించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
