Clock Of Nellore ( Nellore ) – గురువారం కార్మిక సంఘాల నాయకులు కత్తి శ్రీనివాసులు, వివిధ విభాగాల కార్మికులు నెల్లూరు నగరపాలక సంస్థ లోని మేయర్ కార్యాలయంలో మేయర్ స్రవంతిని కలిసి పలు సమస్యలపై వినతి పత్రాన్ని అందజేశారు. వేతనాల బకాయిలు, పి.యఫ్, ఇ.యస్.ఐ తదితర సమస్యలను మేయర్ దృష్టికి తీసుకురాగా వాటిపై మేయర్ సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా మేయర్ స్రవంతి మాట్లాడుతూ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరితగతిన సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు, వివిధ విభాగాల కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
