ముందే గుర్తిస్తే బ్రెయిన్ ట్యూమర్ ను నివారించవచ్చు : అపోలో వైద్యులు

Clock Of Nellore ( Nellore ) – వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డే ని పురస్కరించుకొని నెల్లూరులోని అపోలో స్పెషాలిటీ హాస్పటల్ లో పత్రికా విలేఖరుల సమావేశం జరిగింది. మెదడుకు వచ్చే వ్యాధుల నివారణకు అపోలో ఆస్పత్రిలో ఉన్న అత్యాధునిక వసతుల గురించి ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న సీనియర్ సర్జన్లు వివరించారు. ఈ సందర్భంగా అపోలో ఆస్పత్రి సీనియర్ న్యూరో సర్జన్లు డాక్టర్ వి. కే.ఆనంద్, డాక్టర్ రమణమూర్తి మాట్లాడుతూ మెదడులోనే మొదలై పెరిగే కణితులను ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్స్ అంటారు. శరీరంలోని ఇతర భాగాల నుండి మెదడుకి వ్యాపించే కణితులు భిన్నంగా ఉంటాయి. వీటిని సెకండరీ బ్రెయిన్ ట్యూమర్స్ అని అంటారు. మెదడు కణితులు చిన్న పరిమాణం నుండి పెద్ద పరిమాణంలో ఉంటాయి. కొన్ని మెదడు కణితులు చిన్నవిగా ఉన్నప్పుడు కనిపిస్తాయి. వీటిని వెంటనే గమనించొచ్చు. ఇతర కణాలను గమనించకముందే పెరుగుతాయి. మొదడు కణుతులు తక్కువగా చురుగ్గా ఉంటే వెంటనే లక్షణాలను చూపించకపోవచ్చు. లక్షణాలను గమనించక ముందే కణితి పరిమాణం పెద్దదిగా మారొచ్చు. వీటిని రెండు ప్రధాన సమూహాలుగా విభజించారు. ప్రాథమిక, మెటాస్టాటిక్ మెదడు కణితులు. మాయో క్లినిక్ ప్రకారం కొన్ని మెదడు కణితులు ప్రమాదరకమైనవి కాదు. మరికొన్ని మాత్రం మరీ ప్రాణాంతకమైనవి. కణితి స్థానాన్ని బట్టి మెదడు కణితి లక్షణాలు భిన్నంగా ఉంటాయని యూకె నేషనల్ హెల్త్ సర్వీసెస్ చెబుతోంది. కొన్ని లక్షణాలను చూస్తే…తలనొప్పి, మూర్చ, అనారోగ్యం, వికారం, వాంతులు, నీరసం, మానసిక సమస్యలు, జ్ఞాపకశక్తి తగ్గడం, పక్షవాతం, చూపు, వినికిడి సమస్యలు…ప్రపంచ వ్యాప్తంగా మరణాలకు ప్రధాన కారణాల్లో బ్రెయిన్ ట్యూమర్ కూడా ఓ కారణం.

మెదడులో కణితిని అనుమానిస్తే, ఏదైనా నాడీ సంబంధిత మార్పులను గమనిస్తే ముందుగా డాక్టర్‌తో పరీక్షించుకోవాలి. న్యూరోలాజికల్ టెస్ట్, హెడ్ సిటి స్కాన్, మెదడు ఎమ్‌ఆర్ఐ, మెదడు పీఈటీ స్కాన్, బయాప్సీ వంటివి బ్రెయిన్ ట్యూమర్‌ని గుర్తించే మార్గాలు. మెదడు కణుతులు, క్యాన్సర్ వ్యాప్తి చెందే అవకాశం లేనందున, ఇతర క్యాన్సర్ల మాదిరిగా వాటికి స్టేజెస్ లేవు. దీనికి వెంటనే ట్రీట్‌మెంట్ అవసరం. తలనొప్పితో వచ్చిన రోగికి సీటీ స్కాన్, ఎంఆర్‌ఐ స్కాన్‌లు చేయడం ద్వారా బ్రెయిన్‌ ట్యూమర్‌ను నిర్ధారిస్తారు. ఒకప్పుడు బ్రెయిన్‌ ట్యూమర్‌ను నాలుగో దశ వచ్చే వరకూ గుర్తించే వారు కాదు. వ్యాధి నిర్ధారణ కాకముందే మరణించినవారు కూడా ఉన్నారు. ఇప్పుడు అత్యాధునిక డయాగ్నోస్టిక్‌ సేవలు అందుబాటులోకి రావడంతో తొలిదశలోనే గుర్తించగలుగుతున్నారు. 150 కంటే ఎక్కువ రకాల బ్రెయిన్ ట్యూమర్స్ ఉన్నాయి. అయినప్పటికీ, గ్లియోబ్లాస్టోమా అనేది పెద్దవారిలో అత్యంత తీవ్రమైన క్యాన్సర్. గ్లియోబ్లాస్టోమా అనేది మెదడు, వెన్నుపాములోని కణాల పెరుగుదలగా వచ్చే క్యాన్సర్ అని మాయో క్లినిక్ చెబుతుంది. ఇది త్వరగా పెరుగుతుంది. ఆరోగ్యకరమైన కణజాలంపై దాడి చేసి నాశనం చేయగలదు. నరాల కణాలకు సపోర్ట్‌ని ఇచ్చే ఆస్ట్రోసైట్స్ అనే కణాల నుండి గ్లియోబ్లాస్టోమా ఏర్పడుతుంది. ఈ కార్యక్రమంలో న్యూరో సర్జన్లు డాక్టర్ యశ్వంత్ సందీప్, డాక్టర్ ఉబేద్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

Read Previous

నెల్లూరు మెడికవర్ హాస్పిటల్ లో బ్రెయిన్ ట్యూమర్ డే

Read Next

బుజబుజ నెల్లూరులో మేయర్ స్రవంతి పర్యటన : పారిశుధ్య పనుల పరిశీలన

Leave a Reply

Your email address will not be published.